టమాటా మజ్జిగ పులుసు

ABN , First Publish Date - 2015-09-02T20:53:52+05:30 IST

కావలసిన పదార్థాలు: టమాటాలు - రెండు, మజ్జిగ - నాలుగు కప్పులు, శనగ పిండి - ఒక టీస్పూను

టమాటా మజ్జిగ పులుసు

కావలసిన పదార్థాలు: టమాటాలు - రెండు, మజ్జిగ - నాలుగు కప్పులు, శనగ పిండి - ఒక టీస్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, పచ్చి మిర్చి - రెండు, అల్లం ముక్కలు - ఒక టీ స్పూను, వాము - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - ఒక టీ స్పూను. తాలింపు కోసం - ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు.
తయారుచేసే విధానం: టమాటా ముక్కల్లో మజ్జిగ, ఉప్పు, పసుపుతో పాటు, శనగ పిండిని నీళ్ళల్లో కలిపి వేసి ఉడికించాలి. తరువాత వాము, పచ్చి మిర్చి, అల్లం ముద్ద నూరుకుని, ఉడుకుతున్న టమాటా ముక్కల్లో వేసి మరికాసేపు సన్నని మంట మీద ఉడికించి దించుకోవాలి. చల్లారాక తాలింపు వేసుకుని కొత్తిమీర చల్లుకోవాలి.

Updated Date - 2015-09-02T20:53:52+05:30 IST