తోటకూర కొబ్బరి సాంబారు

ABN , First Publish Date - 2015-11-18T14:11:43+05:30 IST

కావలసిన పదార్థాలు: కొబ్బరిపాలు - 2 కప్పులు, ఉడికించిన పెసరపప్పు - 1/2 కప్పు, తోటకూర - తరిగినది 1 కట్ట ఉల్లిపాయ - తరిగినది ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి - తరిగినవి 6,

తోటకూర కొబ్బరి సాంబారు

కావలసిన పదార్థాలు: కొబ్బరిపాలు - 2 కప్పులు, ఉడికించిన పెసరపప్పు - 1/2 కప్పు, తోటకూర - తరిగినది 1 కట్ట ఉల్లిపాయ - తరిగినది ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి - తరిగినవి 6, నిమ్మరసం - 1, టేబుల్‌ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఎండుమిర్చి - 1, ఆవాలు, జీలకర్ర - 1 టీ స్పూను, ఉప్పు, పసుపు, కొత్తిమీర - తగినంత.

తయారు చేయు విధానం: ఒక గిన్నెలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తోటకూర వేసి మూతపెట్టి మగ్గించాలి. తరువాత పెసరపప్పు వేసి మెత్తగా ఉడికాక కొబ్బరిపాలు, ఉప్పు, పసుపు వేసి మరిగిన తరువాత నిమ్మరసం, కొత్తిమీర వేసి దించేయాలి. ఇది కూడా అన్నంలోకి బాగుంటుంది.

Updated Date - 2015-11-18T14:11:43+05:30 IST