కొత్తిమీర చపాతీలు

ABN , First Publish Date - 2015-12-05T14:08:15+05:30 IST

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - నాలుగు కప్పులు, వెన్న - ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర తురుము - ఒక కట్ట, పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత, నూనె -

కొత్తిమీర చపాతీలు

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - నాలుగు కప్పులు, వెన్న - ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర తురుము - ఒక కట్ట, పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: కొత్తిమీరని సన్నగా తరగాలి. ఇందులో గోధుమపిండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, వెన్న, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి. ఒక గంట తర్వాత చపాతీలు చేసుకుని వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-12-05T14:08:15+05:30 IST