పచ్చి కొబ్బరి పులుసు

ABN , First Publish Date - 2015-12-23T16:57:06+05:30 IST

కావలసిన పదార్థాలు: పచ్చికొబ్బరి-కాయలో సగం ముక్క, పచ్చిమిర్చి-రెండు, నీరు సరిపడా, ఉల్లిపాయలు-2, నూనె, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర-పోపుకు సరిపడా,

పచ్చి కొబ్బరి పులుసు

కావలసిన పదార్థాలు: పచ్చికొబ్బరి-కాయలో సగం ముక్క, పచ్చిమిర్చి-రెండు, నీరు సరిపడా, ఉల్లిపాయలు-2, నూనె, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర-పోపుకు సరిపడా, కొత్తిమీర, పసుపు-చిటికెడు, ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా పచ్చి కొబ్బరిని తురిమి ఓ గిన్నెలో పెట్టుకోవాలి. తరువాత బాణలిలో కొద్దిగా నూనె పోసి, అందులో ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొబ్బరి తురుము వేసి దోరగా వేయించుకోవాలి. అంతే పచ్చి కొబ్బరి పులుసు రెడీ అయినట్లే.. ఇది వేడి వేడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-12-23T16:57:06+05:30 IST