గుమ్మడి సూప్

ABN , First Publish Date - 2016-05-18T14:21:12+05:30 IST

కావలసిన పదార్ధాలు: గుమ్మడికాయ ముక్కలు - పావుకిలో, పెరుగు - ఒక టేబుల్‌ స్పూన, ఉడికించిన కూరగాయ ముక్కలు - మూడు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, రెడ్‌ చిల్లీ పేస్టు - ఒక టేబుల్‌ స్పూన్,

గుమ్మడి సూప్

కావలసిన పదార్ధాలు: గుమ్మడికాయ ముక్కలు - పావుకిలో, పెరుగు - ఒక టేబుల్‌ స్పూన, ఉడికించిన కూరగాయ ముక్కలు - మూడు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, రెడ్‌ చిల్లీ పేస్టు - ఒక టేబుల్‌ స్పూన్, ఆలివ్‌ ఆయిల్‌ - ఒక టేబుల్‌ స్పూన, సోయాసాస్‌ - ఒక టీ స్పూన్, కొబ్బరిపాలు - రెండు కప్పులు, ఉప్పు- తగినంత, కొత్తిమీర - ఒక కట్ట.
 
తయారీ: పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక స్పూన ఆలివ్‌ ఆయిల్‌ వేసి, కొద్దిగా వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పెరుగు, రెడ్‌ చిల్లీ పేస్టు (ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రేకలు, అల్లం అన్నీ కలిపి తయారుచేసిన పేస్టు) వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేగాక ఉడికించిన కూరగాయ ముక్కల ముద్ద, ఉడికించిన గుమ్మడి ముక్కల పేస్టు వేసి బాగా కలిపి మరో పది నిమిషాలు గరిటతో కలుపుతూ వేయించాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, ఒక గ్లాసు నీళ్ళు, ఉప్పు, సోయాసాస్‌ వేసి మరో పావుగంటసేపు మరిగించాలి. దించేటప్పుడు కొత్తిమీర తురుము వేయాలి. అంతే వేడి వేడి గుమ్మడి సూప్‌ రెడీ.

Updated Date - 2016-05-18T14:21:12+05:30 IST