సొరకాయ పాయసం

ABN , First Publish Date - 2016-08-08T21:12:53+05:30 IST

కావలసినవి: పాలు - ఒక లీటరు/ఐదు కప్పులు, సొరకాయ - 500 గ్రాములు (పొట్టు,గింజలు

సొరకాయ పాయసం

కావలసినవి: పాలు - ఒక లీటరు/ఐదు కప్పులు, సొరకాయ - 500 గ్రాములు (పొట్టు,గింజలు తీసి తురమాలి. దాదాపు మూడు కప్పులు.), నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన్‌, పంచదార - అర కప్పు, జీడిపప్పులు - పది, బాదం - ఆరు, ఎండుద్రాక్షలు - 15, యాలకలపొడి - అర టీస్పూన్‌.
 
తయారీ: పాలను వేడిచేయాలి. అవి వేడయ్యాక స్టవ్‌ మంట తగ్గించి పాలు 3/4 వంతు అయ్యే వరకు ఉంచాలి. సొరకాయ తురుమును పిండి నీటిని తీసేయాలి. ఆ నీళ్లను పారబోయొద్దు. వాటిని పప్పులో లేదా రొట్టె పిండి కలిపేటప్పుడో వాడొచ్చు. పాన్‌లో నెయ్యి వేడిచేసి సొరకాయ తురుము వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. అందుకు ఐదారు నిమిషాలు పడుతుంది. తరువాత కాగపెట్టిన పాలు పోసి బాగా కలపాలి. పాలు ఉడుకుతుండగా డ్రైఫ్రూట్స్‌ వేసి ఓ మాదిరి మంట నుంచి సన్నటి మంట మీద వరకు పదినిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో పాయసాన్ని గరిటెతో కలుపుతుండాలి. తరువాత పంచదార, యాలకలపొడి వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. పాయసం రెడీ అయ్యిందా చూడాలంటే స్పూన్‌తో పాయసాన్ని తీసుకుని జారవిడిస్తే పాలు, సొరకాయ తురుము కలిపి కిందకు జారాలి. అలా కాకుండా సొరకాయ తురుము స్పూన్‌కి పట్టుకుని ఉంటే మరికొంచెంసేపు ఉడికించాలి. చల్లగా లేదా వేడిగా మీ ఇష్టం ఎలా తిన్నా పైన డ్రైఫ్రూట్స్‌తో అలంకరించు కుని తింటే యమ్మీగా ఉంటుంది. పాయసం క్రీమీగా ఉండాలంటే అందులో అరకప్పు కండెన్స్‌ మిల్క్‌ కలుపుకోవాలి. ఇలా చేసినప్పుడు పంచదార మోతాదు తగ్గించాలి. అలాగే పాలను ఎక్కువసేపు సన్నటి మంట మీద ఉంచాల్సిన అవసరమూ లేదు.

Updated Date - 2016-08-08T21:12:53+05:30 IST