చిక్కుడు పచ్చడి

ABN , First Publish Date - 2017-02-18T17:00:40+05:30 IST

చిక్కుడు కాయలు - పావు కిలో, మెంతిపిండి - ఒక టేబుల్‌ స్పూన్‌, పసుపు - పావు టేబుల్‌ స్పూన్‌, వెల్లుల్లి పాయలు - మూడు, ఉప్పు, కారం - ఒక్కోటి నాలుగు టేబుల్‌ స్పూన్ల చొప్పున,

చిక్కుడు పచ్చడి

కావలసినవి: చిక్కుడు కాయలు - పావు కిలో, మెంతిపిండి - ఒక టేబుల్‌ స్పూన్‌, పసుపు - పావు టేబుల్‌ స్పూన్‌, వెల్లుల్లి పాయలు - మూడు, ఉప్పు, కారం - ఒక్కోటి నాలుగు టేబుల్‌ స్పూన్ల చొప్పున, నూనె - సరిపడా, నిమ్మకాయలు - రెండు, పోపు గింజలు - ఒక టేబుల్‌ స్పూన్‌, ఆవాలు - అరటేబుల్‌ స్పూన్‌, జీలకర్ర - ఒక టేబుల్‌ స్పూన్‌, కరివేపాకులు - రెండు రెమ్మలు.
 
తయారీ: చిక్కుడు కాయల్ని శుభ్రం చేసి కోసి ఆరబెట్టాలి. చిక్కుడు కాయలు ఆరాక అవి కొద్దిగా మెత్తబడేవరకు నూనెలో వేగించాలి. అవి మెత్తబడ్డాక ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, మెంతిపొడి వేసి బాగా కలపాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం నూనె పోసి వేడిచేయాలి. ఇందులో పోపుగింజలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు వేసి 30 సెకన్లు వేగించాలి. దీన్ని చిక్కుడుకాయల మిశ్రమంలో వేసి కలిపితే చిక్కుడుకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి చేసేటప్పుడు నీరు లేకుండా చూసుకోవాలి. అలాగైతేనే పచ్చడి పాడు కాకుండా ఉంటుంది. అన్నంతో కలిపి తింటే బాగుంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్‌, పీచు పదార్ధాలు మనల్ని బలంగా ఉంచుతాయి.

Updated Date - 2017-02-18T17:00:40+05:30 IST