అస్సామీ బ్రేక్‌ఫాస్ట్‌ పోయిట భాత్

ABN , First Publish Date - 2017-04-01T20:39:28+05:30 IST

కావాల్సిన పదార్థాలు అన్నం - ఒక కప్పు, పెరుగు - పావు కప్పు లేదా మజ్జిగ - అరకప్పు, ఉల్లి తరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి (తరిగి) - రెండు, ఉప్పు - రుచికి సరిపడా.

అస్సామీ బ్రేక్‌ఫాస్ట్‌ పోయిట భాత్

కావాల్సిన పదార్థాలు
అన్నం - ఒక కప్పు, పెరుగు - పావు కప్పు లేదా మజ్జిగ - అరకప్పు, ఉల్లి తరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి (తరిగి) - రెండు, ఉప్పు - రుచికి సరిపడా.
 
ఆలు పిటిక కావలసినవి:
ఆలు(బంగాళాదుంపలు) - మూడు, పసుపు - అర టీస్పూన్‌, ఆవనూనె - ఒక టేబుల్‌ స్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - రుచికి సరిపడా.
 
 
తయారీ విధానం
అన్నంలో రెండు కప్పుల నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం చిలికన పెరుగు లేదా మజ్జిగ పోసి బాగా కలపాలి. తరువాత ఉప్పు, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి పక్కన పెట్టాలి.
ఆలూ పిటిక తయారీ కోసం ఆలుని ఉడికించాలి. తరువాత పొట్టు తీసి మెత్తగా చేతితో నలపాలి.
కడాయిలో ఆవనూనె వేడిచేయాలి. పొగలు వస్తున్నప్పుడు పసుపు వేసి కలపాలి.
వెంటనే మెదిపిన ఆలుని వేసి బాగా కలపాలి.
తరిగిన పచ్చిమిర్చి వేసి మరోసారి కలపితే ఆలూ పిటిక రెడీ.
ఈ అస్సామీ బ్రేక్‌ఫాస్ట్‌ వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు చాలా బాగా పనిచేస్తుంది.

Updated Date - 2017-04-01T20:39:28+05:30 IST