చిలగడదుంప పాయసం

ABN , First Publish Date - 2017-07-15T20:09:22+05:30 IST

కావలసిన పదార్థాలు చిలగడ దుంపలు - పావు కేజీ, పెసరపప్పు - ముప్పావు కప్పు, బాస్మతి రైస్‌

చిలగడదుంప పాయసం

కావలసిన పదార్థాలు
 
చిలగడ దుంపలు - పావు కేజీ, పెసరపప్పు - ముప్పావు కప్పు, బాస్మతి రైస్‌ - రెండున్నర కప్పులు, బెల్లం - 2 కప్పులు, శొంఠిపొడి - అర టీ స్పూను, కొబ్బరి పాలు - ఒక కప్పు.
 
తయారుచేసే విధానం
 
బియ్యాన్ని అరగంట నానబెట్టి నీరు వడకట్టి బరకగా రుబ్బుకోవాలి. లోతైన పాత్రలో రుబ్బిన బియ్యం, దోరగా వేగించిన పెసరపప్పుతో పాటు కప్పు నీరు జత చేయాలి. పప్పు ముప్పావు వంతు ఉడికిన తర్వాత తొక్కతీసి తరిగిన చిలగడదుంప ముక్కలు వేయాలి. అన్నీ ఉడికిన తర్వాత మెదిపి విడిగా నీటిలో కరిగించిన బెల్లం, శొంఠి పొడి వేసి 10 నిమిషాలు చిన్న మంటపై అడుగంటకుండా తిప్పాలి. చివర్లో కొబ్బరి పాలు పోయాలి. దించేముందు బాదం తరుగు చల్లి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

Updated Date - 2017-07-15T20:09:22+05:30 IST