చికెన్‌ సూప్

ABN , First Publish Date - 2017-07-22T23:10:38+05:30 IST

కావలసిన పదార్థాలు చికెన్‌ - 150 గ్రా., నీళ్లు - 400 మి.లీ మిరియాల పొడి - 1 టీ స్పూను

చికెన్‌ సూప్

కావలసిన పదార్థాలు
 
చికెన్‌ - 150 గ్రా., నీళ్లు - 400 మి.లీ
మిరియాల పొడి - 1 టీ స్పూను
వెల్లుల్లి - 2, ఉల్లిపాయలు - 4
జీలకర్ర - 1 టీ స్పూను
పసుపు - చిటికెడు, ఉప్పు, కొత్తిమీర - తగినంత
 
తయారీ విధానం
 
అన్నిటినీ కలిపి ప్రెషర్‌ కుక్కర్‌లో వేసి మూత పెట్టాలి.
ఒక విజిల్‌ వచ్చిన తర్వాత మంట తగ్గించి, 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
తర్వాత కుక్కర్‌ మూత తీసి వడగట్టి, కొత్తిమీరతో అలంకరించి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-07-22T23:10:38+05:30 IST