టమోటా సూప్‌

ABN , First Publish Date - 2017-09-09T21:59:45+05:30 IST

నూనె - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, (పండిన) టమోటాలు - 5, చిదిమిన వెల్లుల్లి - 2 రెబ్బలు...

టమోటా సూప్‌

కావలసిన పదార్థాలు
 
నూనె - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, (పండిన) టమోటాలు - 5, చిదిమిన వెల్లుల్లి - 2 రెబ్బలు, పంచదార - చిటికెడు, వెజిటబుల్‌ స్టాక్‌ - 2 కప్పులు, పాలు - అరకప్పు, ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత, వెన్న - ఒక స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - ఒక టీ స్పూను.
 
తయారుచేసే విధానం
 
నూనెలో ఉల్లి తరుగు వేగించి టమోటాలు వేసి మెత్తబడ్డాక చల్లార్చి గ్రైండ్‌ చేసి వడకట్టాలి. పాన్‌లో వెన్న వేడి చేసి వెల్లుల్లి తరుగు, పంచదార, వడకట్టిన మిశ్రమంతో పాటు వెజిటబుల్‌ స్టాక్‌, మిరియాల పొడి, ఉప్పు వేసి మరిగించాలి. ఇప్పుడు నీటిలో కరిగించిన కార్న్‌ఫ్లోర్‌, పాలు వేసి సూప్‌ చిక్కబడ్డాక దించి సర్వ్‌ చేయాలి. నూనెలో వేగించిన బ్రెడ్‌ ముక్కలు వేసుకుంటే సూప్‌ మరింత రుచిగా ఉంటుంది.

Updated Date - 2017-09-09T21:59:45+05:30 IST