గుమ్మడి కాయ సూప్‌

ABN , First Publish Date - 2017-11-18T21:23:57+05:30 IST

మీగడ - 1 కప్పు, గుమ్మడి కాయ - 1, తేనె - 1 టీస్పూను, వెల్లుల్లి - 2 రెబ్బలు, ఉల్లిపాయ - 1...

గుమ్మడి కాయ సూప్‌

కావలసిన పదార్థాలు
మీగడ - 1 కప్పు, గుమ్మడి కాయ - 1, తేనె - 1 టీస్పూను, వెల్లుల్లి - 2 రెబ్బలు, ఉల్లిపాయ - 1, చికెన్‌ స్టాక్‌ - 2 లీటర్లు, ఆలివ్‌ ఆయిల్‌ - తగినంత, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, పండు మిర్చి - 2 (విత్తనాలు తీసి సన్నగా తరగాలి), నిమ్మకాయలు - 2, నిమ్మ చెక్క - కొద్దిగా.
 
తయారీ విధానం
ఓవెన్‌ను 200 డిగ్రీల దగ్గర ప్రీ హీట్‌ చేసుకోవాలి. గుమ్మడి కాయను సగానికి కోసి, విత్తనాలు తీసేయాలి. కోసిన వైపు ఆలివ్‌ ఆయిల్‌, ఉప్పు, మిరియాల పొడి రుద్ది పక్కన పెట్టుకోవాలి. ఒక పండు మిరపకాయను టూత్‌పిక్‌తో గుచ్చి గుమ్మడి కాయలో ఉంచాలి. ట్రేలో ఉల్లి ముక్కలు, వెల్లుల్లి ఉంచి, వాటి మీద ఆలివ్‌ ఆయిల్‌ చల్లి, గుమ్మడి కాయతోపాటు ఓవెన్‌లో ఉంచాలి. ఉడికిన తర్వాత ట్రే బయటకు తీసి చల్లారనివ్వాలి.
తర్వాత గుమ్మడి గుజ్జును గరిటతో తీసి పక్కన పెట్టుకోవాలి. దీనిలో ఉల్లి, వెల్లుల్లి, 1 కప్పు చికెన్‌ స్టాక్‌ వేసి బ్లెండర్‌లో మెత్తగా గుజ్జు చేసుకోవాలి. పాన్‌ను వేడిచేసి, మిగిలిన చికెన్‌ స్టాక్‌, తేనె, మీగడ వేసి, కొద్దిగా ఉప్పు కలిపి, చిన్న మంట మీద ఉడికించాలి.
సన్నగా తరిగిన పండుమిర్చి, నిమ్మచెక్క, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి మొత్తం మిక్సీలో వేసి మసాలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు సూప్‌ను బౌల్స్‌లో నింపి, పైన మసాలా చల్లి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-11-18T21:23:57+05:30 IST