ఉలువ పచ్చడి

ABN , First Publish Date - 2017-11-19T20:10:17+05:30 IST

ఉలవలు - 2 టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి - 6, మినప్పప్పు - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను...

ఉలువ పచ్చడి

కావలసిన పదార్థాలు
ఉలవలు - 2 టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి - 6, మినప్పప్పు - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 2, చింతపండు - ఉసిరికాయంత, కరివేపాకు - 4 రెబ్బలు, పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నీరు - పావు కప్పు.
 
తయారుచేసే విధానం
ఉలవల్ని దోరగా వేగించి పక్కనుంచాలి. అదే పాన్‌లో ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, మినప్పప్పు కూడా వేగించాలి. తర్వాత మిక్సీలో పచ్చికొబ్బరి తురుము, వేగిన ఉలవలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, చింతపండు, కరివేపాకు వేసి నీరు చిలకరిస్తూ ముద్దగా నూరుకోవాలి. వేడి వేడి అన్నంతో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2017-11-19T20:10:17+05:30 IST