క్యారెట్‌ సూప్‌

ABN , First Publish Date - 2018-02-03T23:26:21+05:30 IST

క్యారెట్‌ - పావు కేజీ, టమోటాలు - 2, బంగాళదుంప - ఒకటి (చిన్నది), వెల్లుల్లి రెబ్బలు - 6, నూనె - ఒక టీ స్పూను..

క్యారెట్‌ సూప్‌

కావలసిన పదార్థాలు
 
క్యారెట్‌ - పావు కేజీ, టమోటాలు - 2, బంగాళదుంప - ఒకటి (చిన్నది), వెల్లుల్లి రెబ్బలు - 6, నూనె - ఒక టీ స్పూను, ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా.
 
తయారుచేసే విధానం
 
శుభ్రం చేసిన క్యారెట్లు, బంగాళదుంప, టమోటాలను చిన్న ముక్కలుగా తరిగి మెత్తగా ఉడికించి దించేయండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గుజ్జుగా చేయండి. బాణలిలో నూనె వేసి, వెల్లుల్లి రెబ్బలు వేగించండి. తర్వాత క్యారెట్‌ మిశ్రమాన్ని కలిపి, తగినంత నీరు పోసి కొద్దిసేపు మరిగించండి. దించేముందు ఉప్పు, మిరియాలపొడి చల్లండి (పులుపు కావాలనుకుంటే కొద్దిగా ఆమ్‌చూర్‌ పొడి లేదా ఒక టేబుల్‌ స్పూను నిమ్మరసం కలుపుకోవచ్చు). క్యారెట్‌ సూప్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గానూ, లేదా ఈవినింగ్‌ స్నాక్‌గానూ, డిన్నర్‌ముందు ఎపిటైజర్‌గానూ తీసుకోవచ్చు.

Updated Date - 2018-02-03T23:26:21+05:30 IST