అవిసె కారప్పొడి

ABN , First Publish Date - 2018-06-02T18:38:36+05:30 IST

అవిసె గింజలు - 1 కప్పు, మినపగుళ్లు - 2 టేబుల్‌ స్పూన్లు, ధనియాలు - పావు కప్పు, ఎండు మిర్చి...

అవిసె కారప్పొడి

కావలసిన పదార్థాలు
 
అవిసె గింజలు - 1 కప్పు, మినపగుళ్లు - 2 టేబుల్‌ స్పూన్లు, ధనియాలు - పావు కప్పు, ఎండు మిర్చి- 6 కాయలు, ఉప్పు - రుచికి తగినంత, జీలకర్ర - 2 టీ స్పూన్లు, మంచి నూనె - ఒక టేబుల్‌ స్పూను, ఆమ్‌ చూర్‌ (పొడి) - ఒక టీ స్పూను.
 
తయారీ విధానం
 
బాణలిలో నూనె కాగిన తర్వాత ఎండు మిర్చి దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మినపగుళ్లు వేగించాలి. ధనియాలు, జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత మంట తీసెయ్యాలి. వేరే బాణలిలో నూనె లేకుండా అవిసె గింజలు దోరగా వేగించాలి. అన్నీ చల్లారిన తర్వాత ఎండు మిర్చి, మినపగుళ్లు, ధనియాలు, జీలకర్రలను తగినంత ఉప్పు,
ఆమ్‌ చూర్‌ లతో కలిపి మిక్సీలో పొడిచేసుకోవాలి. చివరగా అవిసెగింజలను కూడా వేసి అన్నీ కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ కారప్పొడి వేడి వేడి అన్నంతో లేదా
ఇడ్లీలతో తింటే బాగుంటుంది.

Updated Date - 2018-06-02T18:38:36+05:30 IST