అవిసె గింజల చపాతీ

ABN , First Publish Date - 2018-06-02T18:37:08+05:30 IST

గోధుమ పిండి - 10 చపాతీలకు తగినంత, అవిసె గింజలు - 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, నీళ్లు - పిండి కలపడానికి తగినన్ని....

అవిసె గింజల చపాతీ

కావలసిన పదార్థాలు
 
గోధుమ పిండి - 10 చపాతీలకు తగినంత, అవిసె గింజలు - 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, నీళ్లు - పిండి కలపడానికి తగినన్ని. 
 
తయారీ విధానం
 
అవిసె గింజలను నూనె లేకుండా సన్నని మంటమీద 2 - 3 నిమిషాలు వేగించండి. చల్లారిన తరువాత అర స్పూను గింజలను పక్కకు పెట్టి మిగతా గింజలను మిక్సీలో పొడి చెయ్యండి. పొడిని, గింజలను, గోధుమ పిండిలో వేసి, ఉప్పు, నీళ్లు పోసి చపాతీ పిండి కలపండి. పిండి ముద్దపై తడిపిన గుడ్డ వేసి అరగంట పక్కన పెట్టండి. తర్వాత మామూలుగా చపాతీలు చేసి నూనెతో కానీ నూనె లేకుండా కానీ కాల్చి వేడి వేడిగా ఏదైనా కూరతో వడ్డించండి.

Updated Date - 2018-06-02T18:37:08+05:30 IST