సేమియా కేసరి

ABN , First Publish Date - 2018-11-03T20:33:15+05:30 IST

సేమియా - ఒక కప్పు, నీరు - రెండున్నర కప్పులు, పంచదార - ఒక కప్పు, నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు...

సేమియా కేసరి

కావలసిన పదార్థాలు
- 
సేమియా - ఒక కప్పు, నీరు - రెండున్నర కప్పులు, పంచదార - ఒక కప్పు, నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు, ఫుడ్‌ కలర్‌ - చిటికెడు, యాలకుల పొడి - అర టీ స్పూను, బాదం, జీడిపప్పు - 10 చొప్పున.
 
తయారుచేసే విధానం
ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ దోరగా వేగించి తీసి పక్కనుంచాలి. అదే పాన్‌లో మిగతా నెయ్యి వేసి సేమియాను చిన్నమంటపై దోరగా వేగించాలి. తర్వాత నీరు పోసి కొద్ది సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు పంచదార వేసి అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ కరగనివ్వాలి. పంచదార కరిగాక యాలకుల పొడి, ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి. చివర్లో బాదం, జీడిపప్పులు వేసి మరోసారి కలిపి మంట తీసెయ్యాలి.

Updated Date - 2018-11-03T20:33:15+05:30 IST