Abn logo

ఖర్జూర లడ్డూ

ఖర్జూరంలో విటమిన్‌ బి6, రాగి, మెగ్నీషియం ఉంటాయి. జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎదిగే పిల్లల బుద్ధి బలానికి ఎంతో అవసరం. కాబట్టి వీటినెలా తయారు చేయాలంటే....
 
కావలసిన పదార్థాలు:  ఖర్జూరాలు - 1 కప్పు, పచ్చి కొబ్బరి - అర కప్పు, జీడిపప్పు - 1 కప్పు, కొబ్బరి నూనె - రెండు టీస్పూన్లు
 
తయారీ విధానం: ఖర్జూరాలను విత్తనాలు తీసి గంటపాటు నీళ్లలో నానబెట్టాలి.
తర్వాత ఆరబెట్టి పక్కనుంచాలి. జీడిపప్పులో కొబ్బరి కలిపి, బ్లెండ్‌ చేయాలి. దీన్లోనే ఖర్జూరాలు, కొబ్బరి నూనె కూడా వేసి మళ్లీ బ్లెండ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల అదంతా చిక్కని మిశ్రమంలా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని లడ్డూల్లాగా చేతితో ఉండలు చుట్టాలి. వీటిని ఫ్రిజ్‌లో చల్లబరిచి పిల్లలకు ఇస్తే ఇష్టంగా తింటారు.

ఇద్దరిని పెళ్లాడిన యువకుడుబాబా ఆలయానికి భారీ విరాళంలాభసాటి పంటలు సాగు చేయాలి : ఐకే రెడ్డిటీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి వెనక్కిఆయిల్‌ ఫాం వైపు అన్నదాతలువరుస క్రమంలో మొక్కలు నాటాలిఉద్యమ శత్రువులే.. రాజకీయ మిత్రులుచదువులు కొనసాగేనా?హరితహారంపై ప్రత్యేక దృష్టిసారించాలిపథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
Advertisement
Advertisement