అరికల లడ్డు

ABN , First Publish Date - 2019-05-18T21:39:48+05:30 IST

అరికల పిండి - 200 గ్రా., వేరుశనగలు - 50గ్రా., నువ్వులు - 50 గ్రా., బెల్లం - 100 గ్రా., ఎండుకొబ్బరి తురుము - 50 గ్రా., నెయ్యి - 10 గ్రా., బాదంపప్పు..

అరికల లడ్డు

కావలసిన పదార్థాలు
 
అరికల పిండి - 200 గ్రా., వేరుశనగలు - 50గ్రా., నువ్వులు - 50 గ్రా., బెల్లం - 100 గ్రా., ఎండుకొబ్బరి తురుము - 50 గ్రా., నెయ్యి - 10 గ్రా., బాదంపప్పు - 50 గ్రా.
 
తయారీ విధానం
 
ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసి పిండిని బాగా వేయించుకోవాలి. వేరుశనగలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము వేరు వేరుగా వేయించుకోవాలి. ఆ మిశ్రమానికి చిరుధాన్యాల పిండి, బెల్లం కలిపి మళ్లీ మిక్సీ వేసుకోవాలి. ఈ మిశ్రమంలో వేడి చేసుకున్న నెయ్యి వేసి లడ్డూలా చుట్టుకోవాలి.
 
పోషక విలువలు: 100 గ్రాముల ఈ పదార్థంలో శక్తి 479.6 కి.కెలోరీలు, ప్రొటీన్లు 11.11 గ్రా., కొవ్వు 27.101 గ్రా., కాల్షియం 232.89 మి.గ్రా., భాస్వరం 259.82 మి.గ్రా., ఇనుము 1.7 మి.గ్రా.

Updated Date - 2019-05-18T21:39:48+05:30 IST