మటన్‌ సూప్‌

ABN , First Publish Date - 2019-08-03T17:10:16+05:30 IST

కాల్చిన మేక/గొర్రె కాళ్లు - నాలుగు, కొత్తిమీర - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి

మటన్‌ సూప్‌

కావలసినవి
 
కాల్చిన మేక/గొర్రె కాళ్లు - నాలుగు, కొత్తిమీర - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, లవంగాలు - నాలుగు, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాలు - కొన్ని, ఉప్పు - రుచికి సరిపడా.
 
తయారీవిధానం
 
కుక్కర్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మిరియాలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, మేక/గొర్రె కాళ్లు, నూనె, లవంగాలు వేసి బాగా కలపాలి. ఐదారు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత చల్లారే వరకు ఆగి మళ్లీ రెండు, మూడు విజిల్స్‌ వచ్చే దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి చల్లుకుని వేడి వేడిగా తాగితే సూపర్‌గా ఉంటుంది.

Updated Date - 2019-08-03T17:10:16+05:30 IST