పులిస్సెరి

ABN , First Publish Date - 2019-06-01T20:15:43+05:30 IST

బట్టర్‌మిల్క్‌ - కప్పు, కీర - ఒక కప్పు (తరిగినవి), వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉల్లిపాయలు - చిన్నవి రెండు, పసుపు - కొద్దిగా, కొబ్బరి తురుము - అరకప్పు, జీలకర్ర

పులిస్సెరి

కావలసినవి
 
బట్టర్‌మిల్క్‌ - కప్పు, కీర - ఒక కప్పు (తరిగినవి), వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉల్లిపాయలు - చిన్నవి రెండు, పసుపు - కొద్దిగా, కొబ్బరి తురుము - అరకప్పు, జీలకర్ర - అర టీస్పూన్‌, మిరప పొడి - పావు టీస్పూన్‌, ఎండు మిర్చి - రెండు, మెంతులు - పావు టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, నీళ్లు - కప్పు, కొబ్బరినూనె - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారీవిధానం
 
వెల్లుల్లి, ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత అందులో కొబ్బరి తురుము కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ముప్పావు కప్పు నీళ్లు పోసి, తరిగిన కీర ముక్కలు వేసి చిన్న మంటపై ఉడికించాలి. కీర ముక్కలు కాస్త ఉడికిన తరువాత కొబ్బరి తురుము కలిపిన మిశ్రమం కలుపుకోవాలి. ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకుని దింపుకోవాలి. మరొక పాన్‌ తీసుకొని కొబ్బరి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, మెంతులు వేయాలి. అవి చిటపటమన్న తరువాత ఎండు మిర్చి, కరివేపాకు వేయాలి. చివరగా పసుపు, ఉప్పు వేయాలి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మిశ్రమం వేసి బాగా కలియబెట్టాలి. రెండు నిమిషాల తరువాత దింపుకుని వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-06-01T20:15:43+05:30 IST