అరికల గారెలు

ABN , First Publish Date - 2019-05-18T21:41:06+05:30 IST

అరికలు - 100 గ్రా., మినపప్పు - 100 గ్రా., పచ్చిమిర్చి - 100 గ్రా., ఉల్లిపాయలు - 100 గ్రా., కొత్తిమీర - 50 గ్రా., నూనె - 30 మి.లీ., ఉప్పు - తగినంత

అరికల గారెలు

కావలసిన పదార్థాలు
 
అరికలు - 100 గ్రా., మినపప్పు - 100 గ్రా., పచ్చిమిర్చి - 100 గ్రా., ఉల్లిపాయలు - 100 గ్రా., కొత్తిమీర - 50 గ్రా., నూనె - 30 మి.లీ., ఉప్పు - తగినంత.
 
తయారీ విధానం
 
నానబెట్టిన అరికలు, మినపప్పు మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి. పిండిలో తరిగిన ముక్కలు, ఉప్పు కలిపి ఉంచుకోవాలి. బాండీలో నూనె వేసి కాగిన తరువాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని గారెలుగా ఒత్తి నూనెలో వేయించాలి.
 
పోషక విలువలు: 100 గ్రాముల ఈ పదార్థంలో శక్తి 208.5 కి.కెలోరీలు, ప్రొటీన్లు 9.9 గ్రా., కొవ్వు 0.8 గ్రా., కాల్షియం 67.9 మి.గ్రా., భాస్వరం 185.5 మి.గ్రా., ఇనుము 1.5 మి.గ్రా.

Updated Date - 2019-05-18T21:41:06+05:30 IST