కాజూ కట్లీ

ABN , First Publish Date - 2019-08-10T20:45:06+05:30 IST

జీడిపప్పు - పావుకేజీ, పంచదార - పావుకేజీ, పాలు - పావులీటరు, నెయ్యి - ఒక టీస్పూన్‌.

కాజూ కట్లీ

కావలసినవి
 
జీడిపప్పు - పావుకేజీ, పంచదార - పావుకేజీ, పాలు - పావులీటరు, నెయ్యి - ఒక టీస్పూన్‌.
 
తయారీవిధానం
 
జీడిపప్పు, పాలను మిక్సీలో వేసి చిక్కటి పేస్టులా అయ్యేలా గ్రైండ్‌ చేయాలి. తరువాత ఈ మిశ్రమంలో పంచదార వేసి చిన్న మంటపై ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక దింపుకోవాలి. మరొక వెడల్పాటి పాన్‌ తీసుకుని నెయ్యి రాసి అందులో మిశ్రమం పోసి అంతటా సమంగా అయ్యేలా చూసుకోవాలి. చల్లారని తరువాత డైమండ్‌ ఆకారంలో వచ్చేలా ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-08-10T20:45:06+05:30 IST