సూజీ హల్వా

ABN , First Publish Date - 2019-08-10T20:42:42+05:30 IST

నెయ్యి - పావుకప్పు, రవ్వ - అరకప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పు, పంచదార - అరకప్పు

సూజీ హల్వా

కావలసినవి
 
నెయ్యి - పావుకప్పు, రవ్వ - అరకప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పు, పంచదార - అరకప్పు, యాలకులపొడి - పావుటీస్పూన్‌, బాదం, జీడిపప్పు - పది పలుకులు, ఎండుద్రాక్ష - రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీవిధానం
 
ఒక పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక రవ్వ వేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు చిన్న మంటపై వేగించాలి. మరొకపాన్‌ తీసుకొని నీళ్లు పోసి చిన్న మంటపై మరిగించాలి.
ఇప్పుడు వేగించి పెట్టుకున్న రవ్వను అందులో వేస్తూ కలియబెట్టాలి. రెండు నిమిషాలు ఉడికిన తరువాత పంచదార వేయాలి. మరికాసేపు చిన్నమంటపై ఉంచి దింపుకోవాలి.
యాలకుల పొడి, దంచిన బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కలియబెట్టుకుని. వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-08-10T20:42:42+05:30 IST