క్యారెట్‌ సూప్‌

ABN , First Publish Date - 2019-08-03T17:12:03+05:30 IST

క్యారెట్‌ ముక్కలు - రెండు కప్పులు, ఉల్లిపాయలు - ఒకకప్పు, బంగాళదుంప ముక్కలు - అరకప్పు

క్యారెట్‌ సూప్‌

కావలసినవి
 
క్యారెట్‌ ముక్కలు - రెండు కప్పులు, ఉల్లిపాయలు - ఒకకప్పు, బంగాళదుంప ముక్కలు - అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, పాలకూర - ఒకకట్ట, పాలు - పావుకప్పు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - చిటికెడు.
 
తయారీవిధానం
 
కుక్కర్‌లో క్యారెట్‌, బంగాళదుంపలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు వేసి, ఐదు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, పాలకూర వేసి వేగించాలి. ఇప్పుడు ఉడికించిన సూప్‌ని పోసి కలియబెట్టాలి. మరికాసేపు ఉడికించాలి.
పాలు మరిగించి సూప్‌లో పోయాలి. మిరియాల పొడి చల్లుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-08-03T17:12:03+05:30 IST