గుమ్మడికాయ హల్వా

ABN , First Publish Date - 2019-12-14T17:02:59+05:30 IST

గుమ్మడికాయ - ఒకకేజీ, దాల్చినచెక్క - కొద్దిగా, పంచదార - 150 గ్రాములు, నూనె లేక నెయ్యి - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఎండుద్రాక్ష - 50గ్రాములు, కొబ్బరితురుము -

గుమ్మడికాయ హల్వా

కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ - ఒకకేజీ, దాల్చినచెక్క - కొద్దిగా, పంచదార - 150 గ్రాములు, నూనె లేక నెయ్యి - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఎండుద్రాక్ష - 50గ్రాములు, కొబ్బరితురుము - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం - రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీ విధానం: గుమ్మడికాయ పొట్టు తీయాలి. కొబ్బరి, బాదం వేగించి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో గుమ్మడికాయ, దాల్చిన చెక్క తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. తరువాత నీళ్లన్నీ తీసేసి గుమ్మడికాయను గుజ్జుగా చేయాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక గుమ్మడికాయ గుజ్జు వేసి పదినిమిషాల పాటు వేగించాలి. ఇప్పుడు సరిపడా పంచదార వేయాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉంచాలి. కొబ్బరి తురుము, బాదం వేయాలి. ఎండుద్రాక్ష వేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-12-14T17:02:59+05:30 IST