పనీర్‌ మల్‌పువా స్వీట్

ABN , First Publish Date - 2019-09-14T18:01:07+05:30 IST

పనీర్‌- పావుకేజీ, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూన్‌, ఉప్పు- తగినంత, మొక్కజొన్నపిండి- రెండు టేబుల్‌స్పూన్లు, మైదా- మూడు టేబుల్‌స్పూన్లు, కారం- అర

పనీర్‌ మల్‌పువా స్వీట్

కావలసినవి
 
పనీర్‌- పావుకేజీ, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూన్‌, ఉప్పు- తగినంత, మొక్కజొన్నపిండి- రెండు టేబుల్‌స్పూన్లు, మైదా- మూడు టేబుల్‌స్పూన్లు, కారం- అర టీస్పూన్‌, గరంమసాలా- అర టీస్పూన్‌, నూనె- సరిపడా, వెల్లుల్లి రెబ్బల - రెండు, కరివేపాకు- ఒక కట్ట, పచ్చిమిర్చి- రెండు, జీలకర్ర- అర టీస్పూన్‌, ఉల్లిపాయ- ఒకటి, పెరుగు- రెండు టేబుల్‌స్పూన్లు, కారం- పావు టీస్పూన్‌.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో పనీర్‌, అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి కలపాలి. మొక్కజొన్న పిండి, మైదా, కారం, గరంమసాలా వేయాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపాలి. పిండి పనీర్‌ ముక్కలకు బాగా పట్టేలా చూడాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పనీర్‌ ముక్కలు వేగించాలి. పనీర్‌ ముక్కలు గోధుమ రంగులోకి వచ్చాక తీసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, అల్లం వేగించాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరికాసేపు వేగించాలి.
ఇప్పుడు పెరుగు, కారం వేసి కలియబెట్టాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత వేగించి పెట్టుకున్న పనీర్‌ ముక్కలు వేయాలి. చివరగా గరంమసాలా చల్లి, దింపుకొని వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-09-14T18:01:07+05:30 IST