బెల్లం హల్వా

ABN , First Publish Date - 2019-09-28T18:44:46+05:30 IST

నెయ్యి - అర కప్పు, లవంగాలు - నాలుగు, గోధుమ పిండి - 200గ్రాములు, సేమ్యా - అరకప్పు, బెల్లం - 200గ్రాములు, పాలు - ఒక కప్పు, కుంకుమపువ్వు - కొద్దిగా, జీడిపప్పు

బెల్లం హల్వా

కావలసినవి
 
నెయ్యి - అర కప్పు, లవంగాలు - నాలుగు, గోధుమ పిండి - 200గ్రాములు, సేమ్యా - అరకప్పు, బెల్లం - 200గ్రాములు, పాలు - ఒక కప్పు, కుంకుమపువ్వు - కొద్దిగా, జీడిపప్పు - ఐదారు పలుకులు, ఎండుద్రాక్ష - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీవిధానం
 
ఒక పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక లవంగాలు వేసి వేగించాలి. తరువాత గోధుమపిండి, సేమ్యా వేసి వేగించుకోవాలి. అందులో బెల్లం వేసి కలియబెట్టుకోవాలి. అదే సమయంలో మరొక పాత్రలో పాలు, నీళ్లు సమానంగా పోసి, కుంకుమ పువ్వు వేసి మరిగించాలి. గోధుమపిండి, సేమ్యా వేగాక ఈ పాలు అందులో పోయాలి. ఉడికిన తరువాత ఎండు ద్రాక్ష వేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-09-28T18:44:46+05:30 IST