Advertisement
Advertisement
Abn logo
Advertisement

రసగుల్ల

కావలసినవి
 
పాలు - రెండు లీటర్లు, నిమ్మరసం - పావు కప్పు, మైదా - ఒక టీస్పూన్‌, పంచదార - రెండు కప్పులు, యాలకులపొడి - అర టీస్పూన్‌.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో పాలు తీసుకొని మరిగించాలి. మరుగుతున్న పాలలో నిమ్మరసం వేసి కలపాలి. పాలు పగిలి గడ్డలు గడ్డలుగా తయారవుతుంది. తరువాత స్టవ్‌ ఆర్పేసి పాత్ర పక్కన పెట్టాలి. చల్లారిన తరువాత ఒక పలుచని వస్త్రం సహాయంతో పాల మిశ్రమాన్ని వడబోయాలి. వస్త్రాన్ని దగ్గరకు కట్టి నీళ్లు పూర్తిగా పోయేలా చేయాలి. తరువాత మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు తీసుకుని పంచదార వేసి మరిగించాలి. పంచదార పానకం మరుగుతున్న సమయంలోనే చేసి పెట్టుకున్న ఉండలను వేసి మూత పెట్టాలి. పది నిమిషాల తరువాత స్టవ్‌ ఆర్పేయాలి. ఆవిరి పూర్తిగా పోయే వరకు మూత తీయకూడదు. పంచదార పానకాన్ని గ్రహించి రసగుల్లల సైజు రెట్టింపు అవుతుంది. చల్లారిన తరువాత యాలకుల పొడి వేసుకొని తింటే ఈ రసగుల్లలు భలే రుచిగా ఉంటాయి.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలిపల్లెల్లో రియల్‌ మాఫియాపత్తి ధర పైపైకి..!మత్స్యకారులకు కేంద్రం చేయూతప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలిసినిమా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలిక్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం ‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
Advertisement