కోకోనట్‌ కార్న్‌ సూప్‌

ABN , First Publish Date - 2019-04-16T20:49:07+05:30 IST

కొబ్బరి, స్వీట్‌ కార్న్‌తో నోరూరించే సూప్‌ తయారు చేసుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఈ సూప్‌ ద్వారా అందుతాయి.

కోకోనట్‌ కార్న్‌ సూప్‌

కొబ్బరి, స్వీట్‌ కార్న్‌తో నోరూరించే సూప్‌ తయారు చేసుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఈ సూప్‌ ద్వారా అందుతాయి.
 
కావలసినవి: కొబ్బరి నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ, అల్లం- ఒకటిన్నర టేబుల్‌ స్పూను, పసుపు- పావు టీస్పూను, మొక్కజొన్న గింజలు- అయిదున్నర కప్పులు, కోకొనట్‌ ఫ్లేక్స్‌- సగం కప్పు, నిమ్మరసం- రెండు టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ: పెద్ద పాత్రలో కొబ్బరి నూనె తీసుకొని, మీడియం మంటమీద ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పసుపు, ఉప్పు వేసి ఎనిమిది నిమిషాలు వేగించాలి. మొక్కజొన్న గింజలు, కొబ్బరిపాలు, నీళ్లు పోసి 10 నిమిషాలు మంట మీద ఉంచాలి. ఈ మిశ్రమంలో నిమ్మరసం కలిపితే సూప్‌ తయారవుతుంది. కోకొనట్‌ ఫ్లేక్స్‌ను బంగారు రంగులోకి వచ్చేంత వరకూ వేగించి, ఈ సూప్‌ మీద చల్లుకోవాలి.

Updated Date - 2019-04-16T20:49:07+05:30 IST