మామిడికాయ రసం

ABN , First Publish Date - 2019-04-27T20:46:02+05:30 IST

టొమాటో - 20గ్రాములు, కందిపప్పు - 5గ్రాములు, పచ్చి మామిడికాయ - 50గ్రాములు, కరివేపాకు

మామిడికాయ రసం

కావలసిన పదార్థాలు
 
టొమాటో - 20గ్రాములు, కందిపప్పు - 5గ్రాములు, పచ్చి మామిడికాయ - 50గ్రాములు, కరివేపాకు - ఒకకట్ట, ఎండుమిర్చి - ఒకటి, మిరియాలు - గ్రాము, ధనియాలు -గ్రాము, జీలకర్ర - గ్రాము, అల్లం వెల్లుల్లి - నాలుగు గ్రాములు, ఆవాలు - గ్రాము, పసుపు - టీస్పూన్‌, నూనె - టీస్పూన్‌, ఉప్పు - తగినంత.
 
తయారుచేసే విధానం
 
ముందుగా మిరియాలు, ధనియాలు, జీలకర్రను వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి.
పచ్చి మామిడికాయను నీళ్లలో వేసి ఉడికించాలి. మామిడికాయ బాగా ఉడికిన తరువాత నీళ్లలో నుంచి గుజ్జు తీసేయాలి. దీన్ని మ్యాంగో ప్యూరీ అంటారు. ఇప్పుడు కందిపప్పును ఉడికించుకోవాలి. టొమాటోలు, అల్లం, వెలుల్లి, రసం పౌడర్‌ వేసి ఉడికించాలి. తరువాత మ్యాంగో ప్యూరీ, ఉడికించిన కందిపప్పును కలపాలి. ఒకపాత్రలో నూనె వేసి, వేడి అయ్యాక ఆవాలు, ఎండుమిర్చి వేగించుకోవాలి. కరివేపాకు, పసుపు వేయాలి. దీన్ని టొమాటో మిశ్రమంలో కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-04-27T20:46:02+05:30 IST