మోతీచూర్‌ లడ్డు

ABN , First Publish Date - 2019-08-10T20:37:33+05:30 IST

సెనగపిండి - రెండు కప్పులు, రవ్వ - రెండు టేబుల్‌స్పూన్లు, ఫుడ్‌ కలర్‌ - పావు టీస్పూన్‌, నీళ్లు..

మోతీచూర్‌ లడ్డు

కావలసినవి
 
బూందీ కోసం: సెనగపిండి - రెండు కప్పులు, రవ్వ - రెండు టేబుల్‌స్పూన్లు, ఫుడ్‌ కలర్‌ - పావు టీస్పూన్‌, నీళ్లు - ఒకటిన్నర కప్పు, నూనె - తగినంత. పంచదార పానకం కోసం : పంచదార - ఒకకప్పు, ఫుడ్‌ కలర్‌ - అరటీస్పూన్‌, నీళ్లు - అరకప్పు, యాలకులపొడి- పావు టీస్పూన్‌, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, పిస్తా - నాలుగైదు పలుకులు.
 
తయారీవిధానం
 
ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి పంచదార వేసి మరిగించి పానకం తయారు చేసుకోవాలి. అందులో యాలకుల పొడి, జీడిపప్పు, పిస్తా, ఫుడ్‌ కలర్‌ వేసి పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో నూనె పోసి వేడి చేయాలి. సెనగపిండిలో నీళ్లు పోసి కాస్త చిక్కగా ఉండేలా కలుపుకోవాలి. రంధ్రాలు ఉండే జాలీ తీసుకొని సెనగపిండిని అందులో నుంచి నూనెలో వేయాలి. కాస్త వేగాక బూందీని నూనెలో నుంచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పానకంలో బూందీ వేయాలి. కాసేపు ఆగితే పంచదార పానకం బూందీకి పట్టేస్తుంది. తరువాత బూందీని అరచేతిలోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా ఒత్తుకోవాలి.

Updated Date - 2019-08-10T20:37:33+05:30 IST