సీతాఫలం కొబ్బరి లడ్డూ

ABN , First Publish Date - 2018-11-17T18:51:13+05:30 IST

సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, యాపిల్‌ముక్కలు - కొన్ని, వెనీలా ఐస్‌క్రీమ్‌ - ఒక స్కూప్‌, నెయ్యి - సరిపడా..

సీతాఫలం కొబ్బరి లడ్డూ

కావలసినవి
 
సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, యాపిల్‌ముక్కలు - కొన్ని, వెనీలా ఐస్‌క్రీమ్‌ - ఒక స్కూప్‌, నెయ్యి - సరిపడా, పాలపొడి - రెండు కప్పులు (అవసరమైతే మరికొంత కలుపుకోవచ్చు), కొబ్బరిపొడి - అరకప్పు, జీడిపప్పు, బాదం పొడి- అరకప్పు, పనీర్‌ - 1/3 కప్పు (సన్నగా తురిమి), కోవా -పావుకప్పు, యాలకులపొడి - ఒక టేబుల్‌స్పూను, పాలు - పావుకప్పు, చక్కెర-సరిపడా.
 
తయారీవిధానం
 
బ్లెండర్‌లో సీతాఫలం గుజ్జు, యాపిల్‌ ముక్కలు, వెనీలా ఐస్‌క్రీమ్‌, చక్కెర, పాలు పోసి బాగా బ్లెండ్‌ చేసి దాన్ని పక్కన పెట్టాలి. కడాయి తీసుకుని రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి పోసి సీతాఫలం గుజ్జు, యాపిల్‌ ముక్కల మిశ్రమాన్ని అందులో పోసి పది సెకన్లు ఉడికించాలి. ఒక కప్పు పాలపొడి, అరకప్పు కొబ్బరిపొడి, కాజు, బాదం పొడి వేసి ఉండచుట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమంలో కోవా, పనీర్‌ తరుగు, యాలకుల పొడి, మరో కప్పు పాలపొడి వేసి మిశ్రమం చిక్కబడేవరకూ సన్నని సెగపై ఉడికించాలి. ఇందులో పావుకప్పు పాలుపోసి చిక్కదనం వచ్చేంత దాకా ఉడికించాలి. అది చిక్కబడకపోతే కొద్దిగా పాలపొడి అందులో కలపాలి. అందులో చక్కెర, స్పూను నెయ్యి వేసి స్టవ్‌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం ఉండచుట్టడానికి వీలుగా లేకపోతే ఫ్రీజర్‌లో రెండు నిమిషాలు ఉంచాలి. చేతికి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమంతో లడ్డూలు చుట్టి కొబ్బరిపొడిలో దొర్లించాలి. తర్వాత నిమిషం పాటు వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తింటే బాగుంటాయి.

Updated Date - 2018-11-17T18:51:13+05:30 IST