సీతాఫలం సగ్గుబియ్యం పాయసం

ABN , First Publish Date - 2018-11-17T18:49:24+05:30 IST

సగ్గుబియ్యం - ఒక కప్పు, సీతాఫలం గుజ్జు - అరకప్పు, చక్కెర - ఒక కప్పు, పాలు - లీటరు, నెయ్యి...

సీతాఫలం సగ్గుబియ్యం పాయసం

కావలసినవి
 
సగ్గుబియ్యం - ఒక కప్పు, సీతాఫలం గుజ్జు - అరకప్పు, చక్కెర - ఒక కప్పు, పాలు - లీటరు, నెయ్యి - ఒక టీస్పూను, యాలకుల పొడి - ఒక టీస్పూను, జీడిపప్పు, ఎండుద్రాక్షలు - ఒక్కొక్కటీ ఒక్కో పావు కప్పు.
 
తయారీవిధానం
ముందురోజు రాత్రి నీళ్లల్లో సగ్గుబియ్యం నానబెట్టాలి. లోతు ఎక్కువగా ఉండే నాన్‌స్టిక్‌ పాన్‌లో పాలుపోసి వేడిచేయాలి. ఆ పాలల్లో చక్కెర వేసి అందులో బాగా కలిసిపోయే దాకా ఉడికించాలి. పాలు ముప్పావువంతుకు వచ్చే వరకూ మరిగించాలి. అందులో నానిన సగ్గుబియ్యం వేసి కలిపి చిక్కగా అయ్యేదాకా ఉడికించాలి. సగ్గుబియ్యం కూడా మెత్తగా అవ్వాలి. అందులో సీతాఫలం గుజ్జు, యాలకుల పొడి వేసి కలిపి సన్నని మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి. చిక్కటి ఖీర్‌లా తయారవుతుంది. తర్వాత చిన్న పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేగించాలి. ఖీర్‌లో వాటిని వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో కాసేపు ఉంచాలి. చల్లటి సీతాఫలం-సాబూదానా ఖీర్‌ రుచి సూపర్‌గా ఉంటుంది.

Updated Date - 2018-11-17T18:49:24+05:30 IST