ఉసిరి తీపి పచ్చడి

ABN , First Publish Date - 2018-12-01T23:52:48+05:30 IST

ఉసిరికాయలు - 100 గ్రా, జీలకర్ర - ఒక టీ స్పూను, ఆవాలు - ఒక టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు..

ఉసిరి తీపి పచ్చడి

కావలసిన పదార్థాలు
 
ఉసిరికాయలు - 100 గ్రా, జీలకర్ర - ఒక టీ స్పూను, ఆవాలు - ఒక టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, కారం - 2 టీ స్పూన్లు, ఇంగువ - చిటికెడు, బెల్లం - పావు కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత.
 
తయారుచేసే విధానం
 
ముందుగా కుక్కర్లో ఉసిరికాయలతో పాటు కొద్దిగా నీరు పోసి మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత గింజలు తీసి మెత్తగా రుబ్బుకోవాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేగించాలి. తర్వాత కారంతో పాటు ఉసిరి గుజ్జు కలపాలి. రెండు నిమిషాల తర్వాత బెల్లం, ఉప్పు కలిపి మరికొద్దిసేపు ఉంచాలి. ఈ పచ్చడి దోశలతో మంచి కాంబినేషన్‌.

Updated Date - 2018-12-01T23:52:48+05:30 IST