ఉసిరి పెరుగు చారు

ABN , First Publish Date - 2018-12-01T23:50:33+05:30 IST

పెరుగు - ఒకటిన్నర కప్పులు, ఉప్పు - రుచికోసం, ఉసిరికాయల తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి..

ఉసిరి పెరుగు చారు

కావలసిన పదార్థాలు
 
పెరుగు - ఒకటిన్నర కప్పులు, ఉప్పు - రుచికోసం, ఉసిరికాయల తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి - 2, పచ్చికొబ్బరి కోరు - పావు కప్పు, నెయ్యి - ఒక టీ స్పూను, ఇంగువ - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, ఎండు మిర్చి - ఒకటి, కరివేపాకు - 4 రెబ్బలు.
 
తయారుచేసే విధానం
 
ఉసిరికాయల తరుగు, పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి కోరు కలిపి 2 టేబుల్‌ స్పూన్ల నీటితో పేస్టు చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు, ఉప్పు, ఉసిరి పేస్టు వేసి తగినంత నీరు కలిపి బాగా చిలకాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకుతో తాలింపు వేసి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ చారు వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-12-01T23:50:33+05:30 IST