షీర్‌ఖుర్మా

ABN , First Publish Date - 2018-06-16T19:13:47+05:30 IST

చిక్కనిపాలు-ఐదుకప్పులు (మీగడతో), సేమ్యా- 50 గ్రాములు (వేగించినవి), ఎండుకొబ్బరి తురుము...

షీర్‌ఖుర్మా

కావలసినవి
 
చిక్కనిపాలు-ఐదుకప్పులు (మీగడతో), సేమ్యా- 50 గ్రాములు (వేగించినవి), ఎండుకొబ్బరి తురుము-50 గ్రాములు, చక్కెర-అరకప్పు, యాలకులు-రెండు, ఖర్జూరం ముక్కలు-రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుద్రాక్ష-12, బాదంపప్పులు-పావుకప్పు (సన్నగాకట్‌చేసి), వట్టివేరు-అర టీస్పూను, సిల్వర్‌ఫాయిల్‌ లీవ్స్‌-మూడు.
 
తయారీవిధానం
వెడల్పాటి పాన్‌లో పాలు పోసి బాగా చిక్కగా అయ్యేదాకా మరిగించాలి. సేమ్యాలు, ఎండు కొబ్బరితురుము, చక్కెర, యాలకులు, ఖర్జూరం ముక్కలు, కొన్ని ఎండుద్రాక్షలు, బాదంపప్పు అందులో వేయాలి. ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. అందులో వట్టివేరు వేసి కలిపి రెడీ అయిన చిక్కటి ఖీర్‌ని ఒక పాత్రలో పోయాలి. దానిపై సిల్వర్‌ లీవ్స్‌, బాదం, ఎండుద్రాక్షలు చల్లి తింటే ఎంతో బాగుంటుంది.

Updated Date - 2018-06-16T19:13:47+05:30 IST