‘థాయ్‌’ ప్రాన్‌ సూప్‌

ABN , First Publish Date - 2018-08-25T22:01:57+05:30 IST

కింగ్‌ ప్రాన్స్‌ - పావు కేజీ, నూడిల్స్‌- 150 గ్రా., పచ్చిబఠాణి - పావుకప్పు, కొత్తిమీర తరుగు - అరకప్పు, టామ్‌..

‘థాయ్‌’ ప్రాన్‌ సూప్‌

కావలసిన పదార్థాలు
 
కింగ్‌ ప్రాన్స్‌ - పావు కేజీ, నూడిల్స్‌- 150 గ్రా., పచ్చిబఠాణి - పావుకప్పు, కొత్తిమీర తరుగు - అరకప్పు, టామ్‌ యమ్‌ సూప్‌ (మార్కెట్లో దొరుకుతుంది) - 50 గ్రా., పుదీనా ఆకులు - 4.
 
తయారుచేసే విధానం
 
ముందుగా నూడిల్స్‌ ఉడికించి, నీరు వడకట్టి విడిగా గాలికి ఆరబెట్టాలి. లోతైన పాత్రలో అర లీటరు నీరు పోసి, టామ్‌ యమ్‌ సూప్‌ కలిపి మరిగించాలి. తర్వాత శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి ఉడికించి, సూప్‌ రంగు మారినప్పుడు కొత్తిమీర తరుగు, పచ్చిబఠాణి, పుదీనా ఆకులు వేసి నిమిషం తర్వాత దించేసి వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2018-08-25T22:01:57+05:30 IST