జున్ను స్వీటు

ABN , First Publish Date - 2018-09-01T19:19:55+05:30 IST

జున్నుపాలు - రెండు కప్పులు (మొదటి లేదా రెండవరోజు పాలు వాడాలి), రెగ్యులర్‌ పాలు...

జున్ను స్వీటు

కావలసినవి
 
జున్నుపాలు - రెండు కప్పులు (మొదటి లేదా రెండవరోజు పాలు వాడాలి), రెగ్యులర్‌ పాలు - ఒక కప్పు, బెల్లం - ముప్పావు కప్పు (తరుగు), యాలకులపొడి - అర టీ స్పూను, కేసరి - కొద్దిగా.
 
తయారీవిధానం
 
పాలల్లో బెల్లం తరుగు వేసి అందులో కరిగేదాకా బాగా కలపాలి. అందులో జున్నుపాలు కూడా పోసి కలపాలి. కేసరి, యాలకుల పొడి వేసి కలిపి ఆ మిశ్రమాన్ని కుక్కర్‌ పాన్‌లో పోయాలి. ఇడ్లీకి చేసినట్టే ప్రెషర్‌ పాన్‌ అడుగుభాగంలో తగినన్ని నీళ్లు పోసి వేడెక్కనివ్వాలి. జున్ను పాల మిశ్రమాన్ని ప్రెషర్‌ ప్యాన్‌లో పెట్టి 25 నిమిషాలు స్టవ్‌పై ఉంచాలి. తర్వాత కుక్కర్‌లోంచి తీసి చల్లారనివ్వాలి. దాని పైభాగంలో కొంత బెల్లం నీరు కనిపించినా ఫరవాలేదు. చల్లారే టైముకు బెల్లం నీరంతా మిశ్రమంలోకి ఇంకిపోతుంది.
పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని చతురస్రాకారంలో కట్‌ చేస్తే జున్ను స్వీటు రెడీ.

Updated Date - 2018-09-01T19:19:55+05:30 IST