నేరేడు పచ్చడి

ABN , First Publish Date - 2018-08-11T22:30:38+05:30 IST

నేరేడుపళ్లు - పది, కారం - పావు టీస్పూను, ఇంగువ - చిటికెడు, ఉప్పు - సరిపడా, నూనె, ఆవాలు...

నేరేడు పచ్చడి

కావలసిన పదార్థాలు
 
నేరేడుపళ్లు - పది, కారం - పావు టీస్పూను, ఇంగువ - చిటికెడు, ఉప్పు - సరిపడా, నూనె, ఆవాలు - ఒక్కొక్కటీ ఒక్కో స్పూను, మెంతులు, చక్కెర - ఒక్కొక్కటీ ఒక్కో పావు టీస్పూను, పసుపు - చిటికెడు, కరివేపాకు - గుప్పెడు.
 
తయారీవిధానం
 
కడాయిలో నూనె వేడిచేయాలి. అందులో ఆవాలు, మెంతులు వేసి వేగించాలి.
అవి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, కరివేపాకు అందులో వేయాలి. తర్వాత అందులో నేరేడుముక్కలు, పసుపు, ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. అందులో కారం, చక్కెర వేసి కలిపిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి కడాయిపై మూతపెట్టి మూడు నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి మారిస్తే నేరేడు పళ్ల పచ్చడి రెడీ.

Updated Date - 2018-08-11T22:30:38+05:30 IST