కొర్ర తీపి పొంగలి

ABN , First Publish Date - 2018-09-01T21:20:54+05:30 IST

కొర్రబియ్యం - ముప్పావు కప్పు, పెసరపప్పు - పావు కప్పు, బెల్లం - ఒక కప్పు, యాలకుల పొడి...

కొర్ర తీపి పొంగలి

కావలసిన పదార్థాలు
 
కొర్రబియ్యం - ముప్పావు కప్పు, పెసరపప్పు - పావు కప్పు, బెల్లం - ఒక కప్పు, యాలకుల పొడి - పావు టీ స్పూను, నెయ్యి - 3 టీ స్పూన్లు, జీడిపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చకర్పూరం - చిటికెడు.
తయారుచేసే విధానం
 
ముందుగా కొర్రబియ్యం, పెసరపప్పు విడివిడిగా వేగించి, 3 కప్పుల నీరు కలిపి కుక్కర్లో 3 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి దించేయాలి. ఒక పాత్రలో అరకప్పు నీటిలో బెల్లం కరిగించి కొద్దిసేపు మరిగించాలి. ఇప్పుడు ఉడికించిన బియ్యం, పప్పు మిశ్రమంలో బెల్లం నీరు, యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి బాగా కలపాలి. చివరగా నెయ్యిలో వేగించిన జీడిపప్పు చల్లి వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2018-09-01T21:20:54+05:30 IST