సొరకాయ హల్వా

ABN , First Publish Date - 2018-02-10T21:49:04+05:30 IST

పాలు- అర లీటరు (చిక్కటివి), తొక్క తీసిన సొరకాయ-అర ముక్క, చక్కెర- మూప్పావు కప్పు...

సొరకాయ హల్వా

కావలసినవి
 
పాలు- అర లీటరు (చిక్కటివి), తొక్క తీసిన సొరకాయ-అర ముక్క, చక్కెర- మూప్పావు కప్పు, కోవా-వంద గ్రాములు, ఏలకుల పొడి-ఒక టీస్పూను, డ్రై ఫ్రూట్స్‌- ఒక టేబుల్‌స్పూను (బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పులు).
 
తయారీవిధానం
 
సొరకాయపై నుండే తొక్క తీసేసి సన్నగా తురమాలి. చాలా కొద్ది నీళ్లల్లో సొరకాయ తరుగును ఉడకబెట్టాలి. మెత్తగా ఉడికిన సొరకాయ తరుగులోంచి నీళ్లను పూర్తిగా తీసేయాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి అందులో పాలు పోసి సన్నని మంటపై 20 నిమిషాలు ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికిన సొరకాయ తురుమును అందులో వేసి బాగా సెమి-సాలిడ్‌ రూపుకు వచ్చేదాకా (అంటే దాదాపు 20 నిమిషాలు)ఉడకనివ్వాలి. అదే సమయంలో కోవాను తురిమి దాన్ని కూడా పాన్‌లో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చక్కెర వేసి అందులో బాగా కరగనివ్వాలి. చివరిగా ఏలకుల పొడి, డ్రైఫ్రూట్‌ ముక్కలను అందులో వేయాలి. సొరకాయ హల్వా రెడీ.

Updated Date - 2018-02-10T21:49:04+05:30 IST