గసగసాల పాయసం

ABN , First Publish Date - 2018-03-17T21:03:53+05:30 IST

గసగసాలు- మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యం- రెండు టీస్పూన్లు, బెల్లం -అరకప్పు, కొబ్బరితరుగు...

గసగసాల పాయసం

కావలసినవి
 
గసగసాలు- మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యం- రెండు టీస్పూన్లు, బెల్లం -అరకప్పు, కొబ్బరితరుగు- అర కప్పు, పాలు- రెండు కప్పులు, నీళ్లు- ఒక కప్పు, యాలక్కాయ-ఒకటి.
 
తయారీవిధానం
 
కడాయిని సన్నని మంటపై పెట్టి గసగసాలు, బియ్యంలను కాస్త రంగు మారేవరకు వేగించాలి. బియ్యం, గసగసాలు చల్లారాక మిక్సీలో గ్రైండ్‌ చేయాలి. ఇందులో కొబ్బరి తరుగు, యాలక్కాయ వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు కలపొచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీయాలి. ఇందులో పాలు, బెల్లం, కొద్దిగా నీరు కలిపి కాసేపు ఉడికించాలి. మిశ్రమం ఉడికేటప్పుడు మధ్యమధ్యలో గరిటెతో కలుపుతుండాలి. కాస్త చిక్కనైన తర్వాత స్టవ్‌ ఆపేయాలి. వేడివేడిగా తిన్నా, చల్లగా తిన్నా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం.

Updated Date - 2018-03-17T21:03:53+05:30 IST