Advertisement
Advertisement
Abn logo
Advertisement

బెల్లం ఊరగాయ

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
తోతాపురి మామిడికాయలు-ఐదు, బెల్లం-అర కేజి (తరుగు), నువ్వుల నూనె-250 మిల్లీ లీటర్లు, ఆవాలు-250 గ్రాములు, కారం-125 గ్రాములు, ఉప్పు-125 గ్రాములు, మెంతులు, పసుపు- ఒక్కొక్కటీ రెండు టీస్పూన్లు, ఇంగువ-అర టీస్పూను.
 
తయారీవిధానం
 
మామిడికాయలను నీళ్లతో బాగా కడిగి పొడి బట్టతో తుడవాలి. తరువాత అన్నీ ఒకే సైజు ముక్కలు చేయాలి. ఈ ముక్కలను పొడి బట్టతో శుభ్రంగా తుడిచి మెత్తటి బట్ట మీద ఆరబెట్టాలి. ఊరగాయ జాడీ తడి లేకుండా తుడవాలి. ఆవాలను మెత్తటి పొడిలా గ్రైండ్‌ చేయాలి. మెంతులను కూడా బంగారు రంగులోకి వచ్చేదాకా పాన్‌లో వేగించాలి. అవి చల్లారాక గ్రైండ్‌ చేయాలి. పెద్ద పాత్రను తీసుకుని అందులో ఆవపిండి, పసుపు, మెంతిపొడి, కారం, ఉప్పు వేసి కలపాలి. బెల్లం తరుగు, ఇంగువలను కూడా ఈ మిశ్రమంలో కలపాలి. ఇందులో మామిడిముక్కలను వేసి కలపాలి.
ఊరగాయముక్కల్లో 200 మిల్లీ లీటర్లు నూనె పోసి కలపాలి. ఊరగాయ పిండి, నూనె మామిడి ముక్కలకు బాగా పట్టించాలి. మిగిలిన పిండిని జాడీలో వేసి మిగిలిన 50 మిల్లీలీటర్ల నూనెను కూడా జాడీలో పోయాలి. మూడురోజుల పాటు అలాగే ఉంచాలి.
మొదటి రోజు ఊరగాయపై నూనె చేరిందో లేదో చూడాలి. ఊరగాయ రుచి చూసి ఉప్పగా ఉందనిపిస్తే ఇంకో వారం రోజుల మామిడి ముక్కలను నూనెలో ఊరనివ్వాలి.
ఉప్పు తక్కువైందనిపిస్తే ఒకటి లేదా రెండు టీస్పూన్ల ఉప్పును కలపాలి. మూడవరోజు ఊరగాయను గరిటెతో కలపాలి. ఊరగాయమీద నూనె సరైన పరిమాణంలో తేలుతోందో లేదో కూడా గమనించాలి. ఒకవేళ నూనె తక్కువగా ఉందనిపిస్తే కొద్దిగా నువ్వుల నూనె ముక్కలపై పోయాలి. గాలిచొరబడని జాడీలో ఊరగాయను నిల్వచేయాలి.

సఖి కేంద్రాల ద్వారా సత్వర న్యాయంకుమరం భీం పోరాట స్ఫూర్తితో హక్కుల సాధించుకోవాలిఎమ్మెల్యే కోనప్పకు సన్మానం క్రీడలతో మానసికోల్లాసం‘దళితబంధు’కు కసరత్తుఅట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచే అభివృద్ధిటీకాతోనే కరోనా నియంత్రణ సాధ్యం బాల్క సుమన్‌కు సన్మానం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
Advertisement