మునగాకు పచ్చడి

ABN , First Publish Date - 2018-05-13T21:03:17+05:30 IST

లేత మునగాకు - 2 కప్పులు, కరివేపాకు - 4, రెబ్బలు, తాలింపు గింజలు - ఒక టీ స్పూను...

మునగాకు పచ్చడి

కావలసిన పదార్థాలు
 
లేత మునగాకు - 2 కప్పులు, కరివేపాకు - 4, రెబ్బలు, తాలింపు గింజలు - ఒక టీ స్పూను, నూనె - ఒక టేబుల్‌ స్పూను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు - రుచికి సరిపడా, వెల్లుల్లి - 10 రెబ్బలు.
తయారుచేసే విధానం
 
నూనెలో ఎండుమిర్చి, పోపు దినుసులు వేగించి కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మరో పెద్ద బాణలిలో మునగాకు వేగించి ఉప్పు, చింతపండుగుజ్జు, పసుపు వేసి మూతపెట్టాలి. ఆకులు మగ్గిన తర్వాత దించేసి చల్లారనివ్వాలి. చివర్లో తాలింపుతో కలిపి మిక్సీలో కానీ రోటిలో కానీ పచ్చడి చేసుకోవాలి.

Updated Date - 2018-05-13T21:03:17+05:30 IST