డ్రై ఫ్రూట్‌ లడ్డు

ABN , First Publish Date - 2017-11-26T03:09:26+05:30 IST

బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌ - పావు కప్పు చొప్పున, గసగసాలు - ఒక టేబుల్‌ స్పూను, యాలకుల పొడి...

డ్రై ఫ్రూట్‌ లడ్డు

కావలసిన పదార్థాలు
 
బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌ - పావు కప్పు చొప్పున, గసగసాలు - ఒక టేబుల్‌ స్పూను, యాలకుల పొడి - అర టీ స్పూను, జాజికాయ పొడి - అర టీ స్పూను, గింజలు తీసిన కర్జూరం - 2 కప్పులు, నెయ్యి - 2 టీ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్‌నట్స్‌ని చిన్న ముక్కలుగా తరిగి స్పూను నేతిలో కొద్దిసేపు వేగించి పక్కనుంచాలి. అదే మూకుడులో మిగతా నెయ్యి వేసి గసగసాలు, చిదిమిన కర్జూరాలు, యాలకుల పొడి, జాజికాయ పొడి ఒకటి తర్వాత ఒకటి కొద్దిసేపు వేగించాలి. తర్వాత ముందు వేగించిన పలుకులు కూడా వేసి బాగా కలిపి దించేయాలి. కొద్ది కొద్ది మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలు చేసుకోవాలి.

Updated Date - 2017-11-26T03:09:26+05:30 IST