నువ్వుల లడ్డు

ABN , First Publish Date - 2017-11-26T03:10:21+05:30 IST

నువ్వులు - ఒక కప్పు, వేరుశనగలు - పావు కప్పు, ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు, బెల్లం తురుము - వంద గ్రా

నువ్వుల లడ్డు

కావలసిన పదార్థాలు
 
నువ్వులు - ఒక కప్పు, వేరుశనగలు - పావు కప్పు, ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు, బెల్లం తురుము - వంద గ్రా., యాలకుల పొడి - అర టీ స్పూను.
 
తయారుచేసే విధానం
 
ముందుగా నువ్వులు, వేరుశనగలు విడివిడిగా వేగించి పక్కనుంచాలి. తర్వాత మంట తీసేసి వేడి పెనంలోనే కొబ్బరి తురము కొద్దిసేపు ఉంచాలి. పొట్టుతీసిన వేరుశనగలు, నువ్వులు, కొబ్బరి తురుము ఒక్కొక్కటిగా మిక్సీలో గ్రైండ్‌ చేస్తూ చివర్లో బెల్లం, యాలకుల పొడి కూడా వేసి తిప్పాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలి.

Updated Date - 2017-11-26T03:10:21+05:30 IST