లెమన్‌ ఎగ్‌ సూప్‌ (జపాన్‌)

ABN , First Publish Date - 2017-12-03T22:49:38+05:30 IST

చికెన్‌ స్టాక్‌ - 600 మి.లీ., పచ్చి రొయ్యలు - 12, గుడ్లు - 4, సోయా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి కాడలు -

లెమన్‌ ఎగ్‌ సూప్‌ (జపాన్‌)

కావలసిన పదార్థాలు
చికెన్‌ స్టాక్‌ - 600 మి.లీ., పచ్చి రొయ్యలు - 12, గుడ్లు - 4, సోయా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి కాడలు - 40 గ్రా., బీట్‌ రూట్‌ - 100 గ్రా., మష్రూమ్స్‌ - 80 గ్రా., క్యారెట్‌ - 40 గ్రా., నిమ్మకాయ - ఒకటి, తెల్ల మిరియాల పొడి - ఒక టీ స్పూను.
 
తయారుచేసే విధానం
ముందుగా మష్రూమ్స్‌, క్యారెట్‌, ఉల్లికాడలు, బీట్‌ రూట్‌ తరిగి చికెన్‌ స్టాక్‌లో వేసి ఉడికించాలి. ముక్కలు మెత్తబడ్డాక శుభ్రం చేసిన రొయ్యలు, సోయా సాస్‌, మిరియాల పొడి వేసి కొద్దిసేపు మరిగించి గుడ్లు కొట్టి వేయాలి. సొన గట్టి పడ్డాక దించేసి నిమ్మకాయ పిండి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-12-03T22:49:38+05:30 IST