ముల్లంగి టమాటా పచ్చడి

ABN , First Publish Date - 2018-05-19T22:53:04+05:30 IST

ముల్లంగి ముక్కలు - 1 కప్పు, టమాటాలు - 2, చింతపండు లేదా పచ్చిమామిడి ముక్కలు...

ముల్లంగి టమాటా పచ్చడి

కావలసిన పదార్థాలు
 
ముల్లంగి ముక్కలు - 1 కప్పు, టమాటాలు - 2, చింతపండు లేదా పచ్చిమామిడి ముక్కలు - రుచికి సరిపడా, పచ్చిమిర్చి - 4, వెల్లుల్లి - 4 రెబ్బలు, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి- 1, జీలకర్ర- 1/2 టీ స్పూను, ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు - తాలింపు కోసం, నూనె - 3 స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా ముల్లంగి ముక్కల్ని తక్కువ నీటిలో పదినిమిషాలు ఉడికించి పక్కన ఉంచండి. పాన్‌లో నూనె వేడెక్కిన తరువాత పచ్చిమిర్చి, టమాటా వేగించండి. దించేముందు చింతపండు/పచ్చిమామిడి ముక్కలు వేసి మంట తీసెయ్యండి. చల్లారిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీలో గ్రైండ్‌ చెయ్యండి. దీనికి ఉడికించిన ముల్లంగి కలిపి కచ్చాపచ్చాగా రుబ్బండి. ఇప్పుడు నూనెలో ఎండుమిర్చి, తాలింపు గింజలు వేగించి ఈ మిశ్రమంలో కలిపి స్టవ్‌ ఆపెయ్యండి. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లి, దోస లాంటి టిఫిన్స్‌తో కూడా బాగుంటుంది.

Updated Date - 2018-05-19T22:53:04+05:30 IST