వంకాయ సూప్

ABN , First Publish Date - 2017-11-18T21:11:55+05:30 IST

వంకాయలు - అర కిలో, ఆలివ్‌ ఆయిల్‌ - 1 టేబుల్‌స్పూను, ఉల్లి ముక్కలు - అర కప్పు, జీలకర్ర - అర టీస్పూను...

వంకాయ సూప్

కావలసిన పదార్థాలు
వంకాయలు - అర కిలో, ఆలివ్‌ ఆయిల్‌ - 1 టేబుల్‌స్పూను, ఉల్లి ముక్కలు - అర కప్పు, జీలకర్ర - అర టీస్పూను, వెల్లుల్లి తరుగు - 1 టీస్పూను, అల్లం తరుగు - 1 టీస్పూను
పచ్చిమిర్చి - 2, ధనియాల పొడి - 1 టీస్పూను, జీలకర్ర పొడి - 1 టీస్పూను, గరం మసాలా - 1 టీస్పూను, కారం - 1 టీస్పూను, టమోటా రసం - 200 మిల్లీ లీటర్లు (అర లీటరు నీళ్లలో 2 టమోటాలు వేసి మరిగించి వడగట్టాలి), కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, యాలకుల పొడి - చిటికెడు, నీరు వార్చి చిలికిన పెరుగు - 1 టీస్పూను
ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా.
 
తయారీ విధానం
వంకాయ ముక్కలకు ఉప్పు, ఆలివ్‌ ఆయిల్‌, మిరియాల పొడి చేర్చి మెత్తబడి, తోలు ఊడేవరకూ గ్రిల్‌ చేయాలి. తర్వాత చల్లారనిచ్చి తోలు వలిచేయాలి. ముక్కలను మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. బాండీలో నూనె పోసి జీలకర్ర వేసి చిటపటలాడాక, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వేసి 1 నిమిషంపాటు వేయించాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి కలపాలి.
దీనికి టమోటా రసం కలిపి 5 నిమిషాలపాటు మరిగించాలి. దీన్లో వంకాయ గుజ్జు వేసి కలిపి, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి తిప్పాలి. కొత్తిమీర తరుగు కూడా వేసి 10 నిమిషాలపాటు మరిగించాలి. తర్వాత చల్లార్చి బ్లెండర్‌లో వేసి తిప్పాలి.
బౌల్‌లో వేసి పెరుగు, యాలకుల పొడి చల్లి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-11-18T21:11:55+05:30 IST